వినాయక్ మూవీలో హీరోయిన్‌గా శ్రియా..?

Mon,May 14, 2018 07:26 PM
Sreya in talks with vv vinayak for balayya Film


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వివి వినాయక్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే చివరివారంలో బాలయ్య, వినాయక్ కాంబో మూవీ గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా మరోసారి శ్రియ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రియను వివి వినాయక్ హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సి కల్యాణ్ నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు శ్రియ. శ్రియ, బాలకృష్ణ కాంబినేషన్‌లో చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

3878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles