కొత్త లుక్‌లో అద‌ర‌గొట్టిన శ్రీ విష్ణు

Sun,October 21, 2018 10:43 AM
sri vishnu cracking look

వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో శ్రీ విష్ణు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ చిత్రాల‌తో అలరించిన శ్రీ విష్ణు ప్ర‌స్తుతం వీర భోగ వ‌సంత రాయ‌లు అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శ‌ర‌ణ్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం దేశంలోని మతవిధానాలకు సంబంధించిన చిత్రంగా ‘వీరభోగ వసంతరాయలు’ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య పాత్ర‌ల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇవి అభిమానుల‌ని ఎంత‌గానో అలరించాయి. తాజాగా శ్రీ విష్ణుకి సంబంధించిన స‌రికొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్ హెయిర్ క‌ట్‌తో, కండ‌లు తిరిగిన దేహంతో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. శ్రీవిష్ణు దేహం మీద.. శివుడి రూపంతో పాటు పలు హిందు దేవుళ్ళ చిహ్నాలు కూడా పచ్చబొట్లుగా కనిపిస్తున్నాయి. ఈ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ నెల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.

3512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles