శ్రీదేవి మైనపు విగ్ర‌హంతో బోనీ, జాన్వీ, ఖుషీ

Wed,September 4, 2019 10:21 AM
Sridevi Wax Statue Unveiled At Madame Tussauds Singapore

దివంగ‌త న‌టి శ్రీదేవికి నివాళిగా ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ కొద్ది సేప‌టి క్రితం సింగ‌పూర్‌లో శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీదేవి భ‌ర్త బోని క‌పూర్, ఆమె కూతుళ్ళు జాన్వీ క‌పూర్‌, ఖుషీ క‌పూర్ హాజ‌ర‌య్యారు. మిస్ట‌ర్ ఇండియా చిత్రంలోని హ‌వా హ‌వాయి సాంగ్‌లో శ్రీదేవి లుక్ మాదిరిగానే మైన‌పు విగ్ర‌హాన్ని త‌యారు చేశారు. జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి మైన‌పు విగ్ర‌హాన్ని చూస్తూ అలా ఉండిపోయింది. శ్రీదేవి మైన‌పు విగ్ర‌హం చూపరుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించింది. ఇటీవ‌ల ఆమె జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు కుటుంబ స‌భ్యులు.







3009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles