హీరోగా శ్రీహ‌రి త‌న‌యుడు

Tue,May 21, 2019 12:02 PM
Srihari Elder Son Soon To Make His Debut

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహ‌రి 2013లో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించడంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కి రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీహ‌రి పెద్ద త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్నాడ‌ని అంటున్నారు.

మేఘాంశ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా భైర‌వ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇందులో శ్రీహ‌రి హీరోగా న‌టించారు. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాల‌కి దూరంగా ఉన్న మేఘాంశ్ త్వ‌రలో రాజ్‌దూత్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న‌ట్టు తెలుస్తుంది. కొన్నాళ్ళ పాటు న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. కార్తీక్ - అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యంలో రాజ్‌దూత్ అనే చిత్రం రూపొంద‌నుంది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట.

8666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles