గాయంతోనే షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో..!

Sat,August 17, 2019 11:53 AM
Star hero shooting despite injury

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ మామ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ‌చైత‌న్య మ‌రో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకోగా, అతి త్వ‌ర‌లో మూవీని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. అయితే ఇటీవ‌ల మేళాలో 500మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు ఫైట‌ర్స్‌తో భారీ యాక్ష‌న్ సీన్‌ని తెర‌కెక్కించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొందిన‌ ఈ ఫైట్ సీక్వెన్స్‌లో వెంకటేష్ కాలికి స్వల్పంగా గాయమైంది. దీంతో యూనిట్ భయాందోళనకు గురైంది. గాయం మ‌రి పెద్ద‌ది కాక‌పోవ‌డంతో స్వ‌యంగా ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం తీసుకొని తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యార‌ట‌. గాయం ఉన్నప్పటికీ, ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే వ‌ర‌కు వ‌రుస షెడ్యూల్‌లో పాల్గొంటూ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాడు వెంక‌టేష్. చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

2263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles