ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ వాయిదా

Sat,August 24, 2019 09:10 AM
statue unveiling postponed

విశ్వ‌నాథ చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఆగ‌స్ట్ 25న‌ ఆవిష్క‌రించ‌నున్నట్టు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిధిగా కూడా హాజ‌ర‌వుతార‌ని వారు అన్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ వాయిదా ప‌డింది. ఆగ‌స్ట్ 25కి బదులు వేరే డేట్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌పాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. అతి త్వ‌ర‌లోనే కొత్త‌ డేట్‌ని ప్ర‌క‌టించ‌నున్నారు.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. 18 జూలై 1974లో ప‌ర‌మ‌ప‌దించారు. చదువుకునే రోజుల నుంచీ ఆయ‌న‌ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు వంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకుగాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఆయన బిరుదులు.

2024
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles