మెగా అనౌన్స్‌మెంట్‌: శింబు హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రం

Sun,April 21, 2019 12:15 PM

ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ స్టూడియో గ్రీన్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా మెగా అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. త‌మిళ స్టార్ హీరో శింబు, యంగ్ హీరో గౌత‌మ్ కార్తీక్ ప్ర‌ధాన పాత్ర‌లో జ్ఞాన‌వేల్ రాజా భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి మ‌ద‌న్ కర్కీ క‌థ అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ‌లో శింబు తొలిసారి న‌టిస్తున్నాడు. శింబు 45వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీ త్వ‌ర‌లో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఆ వెంట‌నే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రి ఇందులో క‌థానాయిక‌లుగా ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. శింబు చివ‌రిగా ‘అత్తారింటికి దారేది’ రీమేక్ చిత్రం ‘వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్’మూవీలో న‌టించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శింబుకి జోడీగా మేఘా ఆకాశ్ , కేథరిన్ థెరిస్సా న‌టించారు .
1623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles