సినిమాల్లోకి వస్తానంటే మహేశ్ వద్దన్నాడు..

Sun,June 17, 2018 02:55 PM
Sudheer babu says about Relationship with maheshbabu

ఎస్ఎంఎస్ చిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈ యాక్టర్ తాజాగా సమ్మోహనం సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు, తనకు మధ్య ఉన్న అటాచ్ మెంట్ గురించి షేర్ చేసుకున్నాడు. ‘మహేష్‌బాబుకు, నాకు సినిమాలే కామన్ టాపిక్. అవి కాకుండా వ్యాయామాలు, ఫిట్‌నెస్, డైట్, ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటాం. ఇద్దరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటాం కాబట్టి రోజు కలవడం కుదరదు. ఎప్పుడైనా వీలు దొరికితే మాత్రం తప్పకుండా కలుస్తుంటాం. పండుగలు ఉంటే మామయ్య కృష్ణ ఇంట్లోనే మేం కలుసుకునేది.

నా ప్రతి సినిమా కథని మహేష్‌తో చర్చిస్తాను. కథలో బెటర్‌మెంట్ కోసం ఏమైనా సలహాలిస్తే తీసుకుంటాను. అంతిమ నిర్ణయం మాత్రం నాదే. సినీరంగంలోకి వస్తానని చెప్పినప్పుడు మహేష్‌బాబు వద్దని వారించారు. పరిశ్రమలో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కలిసి రావాలని అన్నాడు. అయితే నా తొలిచిత్రం ఎస్.ఎం.ఎస్ చూసి మహేష్‌బాబు మెచ్చుకున్నారు. ఆరు నెలల్లోనే అన్నీ నేర్చుకొని సినిమా చేశావు’ అని ప్రశంసించారు.

6037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles