ఇదెలా సాధ్యమో చెప్పుకోండి ?

Tue,November 20, 2018 10:07 AM
sudheer babu video viral in social media

మ‌హేష్ కుటుంబ స‌భ్యుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితం అయిన సుధీర్ బాబు ఇటీవ‌ల స‌మ్మాహనం, నన్ను దోచుకుందువ‌టే చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్నాడు. ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ కూడా స్థాపించాడు. త్వ‌ర‌లో బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపిచంద్ జీవితం ఆధారంగా సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. సుధీర్ బాబు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం, పుల్లెల గోపిచంద్‌తో సుధీర్‌కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేసేందుకు సుధీర్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తున్నాయని, తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. అయితే సుధీర్ బాబు తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో ఓ పోస్ట్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. త‌న‌పై తానే పంచ్ ఇచ్చుకున్న‌ట్టు ఉన్న ఈ వీడియో ఎలా చేయ‌గ‌లిగానో చెప్పండి అనే కామెంట్ పెట్టాడు. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. కెమెరా ట్రిక్ అని కొందరంటుంటే, మ‌రి కొంద‌రు గ్రాఫిక్స్ వ‌ల్ల సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు. మీరు ఈ మేట‌ర్‌పై క్లారిటీ సుధీర్ బాబు ఇస్తాడో లేదో చూడాలి.2314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles