గ‌డ్డం సెంటిమెంట్ సుధీర్ బాబుకి వ‌ర్కవుట్ అవుతుందా ?

Wed,October 24, 2018 08:36 AM
sudheer new look goes viral

ఒక‌ప్పుడు ఎవరైనా గడ్డం పెంచారంటే లవ్ ఫెయిల్యూర్ అని, ఏదో పోగొట్టుకున్నారని అనుకునేవారు. గడ్డం అందానికి అడ్డం అనేది ఒకప్పటి మాట. గడ్డమే అన్నింటికీ ముందు అనేది ఇప్పటి మాట. ఫెయిర్‌గా ఉండి ఫెయిర్ అండ్ లవ్లీ వాడి బాలీవుడ్ హీరోలా తయారైతే.. లవర్‌బాయ్‌లా ఉంటారని అనుకుంటారు. కానీ ఇప్పుడు గడ్డం ఉంటేనే హీరో. మాస్‌లుక్, మ్యాన్లీలుక్ కోసం సినిమాల్లో కూడా గడ్డం తప్పనిసరి అయింది. నందమూరి వారసుడు ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నుంచి మళ్లీ ఈ గడ్డం స్టయిల్ ట్రెండ్ అయింది. రకరకాల స్టయిల్‌లో హీరోలు కూడా ఇప్పుడు గడ్డంతో అందమైన లుక్‌ను సొంతం చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి నుంచి పవన్ కల్యాణ్ దాకా ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. గ‌డ్డంతో వారు తీసిన సినిమాలు కూడా మంచి విజ‌యం సాధిస్తున్నాయి. తాజాగా మ‌హేష్ బావ సుధీర్ బాబు కూడా గ‌డ్డం పెంచి స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌మ్మోహ‌నం, నన్ను దోచుకుందువ‌టే చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్న సుధీర్ బాబు త‌ర్వాతి సినిమా కోసం ఇలా రెడీ అవుతున్నాడా ? అని జ‌నాలు ముచ్చ‌టించుకున్నారు. సుధీర్ బాబు న‌టించిన వీర‌భోగ వ‌సంత రాయ‌లు ఈ శుక్ర‌వారం రిలీజ్ కానుంది.

2018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles