యంగ్ హీరోయిన్‌తో కుమారి 21ఎఫ్ సీక్వెల్ ప్లాన్

Tue,July 2, 2019 08:42 AM
Sukumar To Pen The Sequel To Kumari 21 F

2015లో రాజ్ తరుణ్ హీరోగా కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తుంది. తాజాగా సుకుమార్ దొర‌సాని ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌రు కాగా, అక్క‌డ ఆయ‌న మాట్లాడిన మాట‌లని బ‌ట్టి చూస్తుంటే రంగ‌స్థ‌లం డైరెక్ట‌ర్ త్వర‌లో శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌తో కుమార్ 21 ఎఫ్ సీక్వెల్ చేయ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. దీనిపై త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందా లేదా అనేది చూడాలి. రంగ‌స్థ‌లం చిత్రం త‌ర్వాత సుకుమార్ ఎలాంటి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఆయ‌న త‌దుపరి ప్రాజెక్ట్‌ని ఎప్పుడు ఏ హీరోతో చేస్తాడా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

1821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles