స‌ల్మాన్‌తో కుస్తీ ప‌డుతున్న క‌న్న‌డ స్టార్ హీరో

Sun,August 25, 2019 11:27 AM
sultan and pehelwaan in fight

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇద్ద‌రు కుస్తీ పడుతున్నారు. ఇది రియ‌ల్‌గానో లేదంటే , రీల్‌గానో కాదు. స‌ల్మాన్ ప్రేమిస్తే బంధం ఎలా ఉంటుందో చెప్పేందుకు చిన్న ఉదాహ‌ర‌ణ ఇది అని సుదీప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. స‌ల్మాన్ ఖాన్, సానాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌బాంగ్ 3 చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో క‌న్నడ హీరో సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే దబాంగ్ 3 చిత్రంతో స‌ల్మాన్, సుదీప్ మ‌ధ్య మంచి బంధం ఏర్ప‌డ‌గా, ఖాళీ సమ‌యంలో వీరిద్ద‌రు స‌ర‌దాగా ఇలా ఫోటో దిగారు. ఆ ఫోటోని షేర్ చేసిన సుదీప్ మీ జీవితంలో నాకు చోటు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు స‌ల్మాన్ స‌ర్. దీనిని గౌరవంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను అని తెలిపారు. సుదీప్ .. సైరా అనే తెలుగు చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషించ‌గా, పెహల్వాన్ అనే క‌న్న‌డ చిత్రంలో మ‌ల్ల‌యోధుడి పాత్ర పోషించాడు. ఈ రెండు చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే స‌ల్మాన్ ‘సుల్తాన్‌’లో మల్లయోధుడిగా క‌నిపించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.




1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles