బిగ్ బాస్ కోసం రోజుకి 25 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన సునీల్‌..!

Fri,June 14, 2019 01:49 PM
Sunil Demanding A Huge Pay For reality show

జూలైలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 3కి సంబంధించిన ప్ర‌తి వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. రెండు స‌క్సెస్‌ఫుల్ సీజ‌న్స్ త‌ర్వాత ప్రారంభం కానున్న మూడో సీజన్‌కి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జ‌రుగుతుండ‌గా, ఈ రియాలిటి షోకి హోస్ట్ ఎవ‌రు, ఇందులో పార్టిసిపెంట్స్ ఎవ‌రు అనే దానిపై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధమో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గా కమెడీయ‌న్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న‌ సునీల్‌ని తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించార‌ట‌. ఇందుకు గాను ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. త‌న‌కి రోజుకి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ముట్ట‌జెపితే బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తాన‌ని సునీల్‌ అన్నాడ‌ట‌. దీంతో నిర్వాహ‌కులు బిత్త‌ర‌పోయిన‌ట్టు స‌మాచారం. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి రోజుకి ల‌క్ష‌లు రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తుండ‌గా, సునీల్ చేసిన డిమాండ్ బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌ని షాక్‌కి గురి చేసింద‌ట‌. మ‌రి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్తృత ప్ర‌చారం జ‌ర‌గుతుండగా, ఇది ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజ‌న్‌1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2 ని నాని హోస్ట్ చేశారు. మూడో సీజ‌న్‌కి నాగార్జున హోస్ట్‌గా ఉంటార‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

10122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles