బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్ర రీమేక్‌లో సునీల్..!

Wed,June 12, 2019 01:24 PM
sunil remakes bollywood hit film Andhadhun

ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం అంధాదున్ . ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది. చైనాలో 200కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రాధికా ఆప్టే క‌థానాయిక‌గా న‌టించ‌గా, ట‌బు కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఇందులో ఆయుష్మాన్‌ అంధుడైన ఓ పియానో ప్లేయర్‌గా కనిపించాడు. ఆయ‌న అంధుడైనప్పటికీ మిగతా జ్ఞానేంద్రియాల సహకారంతో తన జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాడు. తనకొక ప్రేయసి కూడా ఉంటుంది. అయితే అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఓ మహిళ పరిచయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త‌మిళంలో సిద్ధార్ద్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు రాగా, తాజాగా తెలుగులో సునీల్ రీమేక్ చేయ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. హీరో నుండి క‌మెడీయ‌న్‌గా సినిమాలు చేస్తున్న సునీల్ హీరోగా అంధాదున్ రీమేక్‌తో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడ‌ని అంటున్నారు. మ‌రి అంధుడిగా సునీల్ ఈ పాత్ర‌కి ఎంత వ‌ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌డు, ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఏంట‌న్న‌ది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

2455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles