మ‌ల‌యాళ సినిమా మొద‌లుపెట్టిన స‌న్నీలియోన్

Sat,February 2, 2019 11:53 AM

బాలీవుడ్ హాట్ బాంబ్ స‌న్నీ లియోన్ ఇటు సౌత్‌, అటు నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అన్ని భాష‌ల‌లో సినిమాలు చేస్తూ అశేష ఆద‌ర‌ణ సంపాదించుకుంటుంది. ఒక‌వైపు ఐటెం సాంగ్స్‌లో న‌టిస్తూనే మ‌రో వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌లు చిత్రాలు చేస్తుంది. త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తుంది . ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే స‌న్నీ మ‌ల‌యాళం డెబ్యూ కూడా సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో బ్యాక్ వాట‌ర్ స్టూడియోస్ పతాకంపై జ‌య‌లాల్ మీన‌న్ నిర్మాణంలో ద‌ర్శ‌కుడు సంతోష్ నాయ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి రంగీలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రోడ్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రం హాస్యంతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ట‌. తాజాగా ఈ చిత్రం అఫీషియ‌ల్‌గా లాంచ్ అయింది. గోవాలో చిత్ర తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. స‌న్నీ ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి చిత్రం మ‌ధుర రాజాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది.

1882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles