స‌న్నీ మ‌ల‌యాళ డెబ్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,November 3, 2018 10:09 AM

బాలీవుడ్ హాట్ బాంబ్ స‌న్నీ లియోన్ ఇటు సౌత్‌, అటు నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అన్ని భాష‌ల‌లో సినిమాలు చేస్తూ అశేష ఆద‌ర‌ణ సంపాదించుకుంటుంది. ఒక‌వైపు ఐటెం సాంగ్స్‌లో న‌టిస్తూనే మ‌రో వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌లు చిత్రాలు చేస్తుంది. స‌న్నీ తాజాగా త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ మూవీ సౌత్‌లో చేస్తుంది . ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే స‌న్నీ మ‌ల‌యాళం డెబ్యూ కూడా సిద్ధ‌మైంది. స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో బ్యాక్ వాట‌ర్ స్టూడియోస్ పతాకంపై జ‌య‌లాల్ మీన‌న్ నిర్మాణంలో ద‌ర్శ‌కుడు సంతోష్ నాయ‌ర్ ఓ ప్రాజెక్ట్ సిద్ధం చేశాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి రంగీలా అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ ప్రాజెక్ట్ ప‌ట్ల తాను ఆస‌క్తిగా ఉన్నాన‌ని స‌న్నీ లియోన్ తెలిపింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధిచిన నటీన‌టుల పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

1611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles