తన గతం గురించి మాట్లాడిన సన్నీలియోని..వీడియో

Mon,April 22, 2019 08:40 PM
sunnyleone is expected to talk about her past in pinch show


బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది సన్నీలియోని. ఈ భామ తాజాగా అర్బాజ్‌ఖాన్ వెబ్ షో పించ్‌లో తళుక్కున మెరిసింది. పించ్‌లో సందడి చేసిన సెలబ్రిటీ సన్నీలియోని ప్రివ్యూ వీడియోను అర్బాజ్‌ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. కొత్త అతిథిని పరిచయం చేస్తూ..ఎస్ ఫర్ స్ట్రాంగ్. ఎస్ ఫర్ @ సన్నీలియోని అని అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎపిసోడ్‌లో సన్నీలియోని తన గతం గురించి మాట్లాడిందట.

గతంలో అడల్ట్ యాక్టర్‌గా నటించడం, హిందీ సినీ పరిశ్రమలో వచ్చిన తర్వాత కెరీర్ ఎలా సాగుతోంది. ఆ సమయంలో నాకు ఉత్తమమైనవనిపించిన నిర్ణయాలు తీసుకున్నానంటూ ప్రీవ్యూలో చెప్పింది సన్నీ. అంతేకాదు సోషల్‌మీడియాలో తనపై ట్రోల్స్ చేస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపింది. నన్ను ట్రోలింగ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే నా పేజ్‌లో మీరు ఎంత సమయం కేటాయిస్తారో నాకు తెలుసు.. అంటూ ట్రోలింగ్ చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేసింది సన్నీలియోని. అర్బాజ్ ఖాన్, సన్నీలియోని తేరా ఇంతజార్ సినిమాలో కలిసి నటించారు. ఈ ఇద్దరి చిట్ చాట్ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

5148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles