ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటున్న స్టార్ హీరోల చిత్రాలు

Sat,April 20, 2019 10:05 AM
super stars cinema shootings at mumbai

ఒక‌రు త‌మిళ సూప‌ర్ స్టార్, మ‌రొక‌రు టాలీవుడ్ రెబ‌ల్ స్టార్. వీరిద్ద‌రి చిత్రాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈ ఇద్ద‌రు హీరోల చిత్రాలని అన్ని ప్రాంతాల‌కి చెందిన ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు . ప్ర‌స్తుతం వీరిరివురి చిత్ర షూటింగ్స్ ముంబైలోనే జ‌రుపుకుంటుండ‌డం విశేషం. మ‌రి ఆ హీరోలేవ‌రో కాదు కేవ‌లం త‌న స్టైల్‌తోనే బాక్సాఫీస్‌ని షేక్ చేసే ర‌జ‌నీకాంత్ ఒక‌రైతే, మ‌రొక‌రు బాహుబ‌లి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన న‌టుడు ప్ర‌భాస్.

పేటా సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం ద‌ర్భార్. ర‌జ‌నీ 167వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ముంబై నేప‌థ్యంలో సాగనున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుపుతున్నారు . రెండు నెల‌లో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ట‌. ‘చంద్రముఖి’, ‘కుశలన్‌’ చిత్రాల తరువాత ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌య‌నతార ద‌ర్భార్ చిత్రంలో న‌టిస్తుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో. స్పై థ్రిల్ల‌ర్‌గా ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ చిత్రానికి పని చేస్తుండ‌గా, ఇందులోని స‌న్నివేశాలని ప్రేక్ష‌కుల ఒళ్లు గ‌గుర్పొడిచేలా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

1158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles