ద‌ర్భార్ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి విడుద‌ల‌

Fri,October 4, 2019 12:17 PM

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ద‌ర్భార్. ఇందులో ర‌జ‌నీ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తుండ‌గా, ఒక పాత్ర‌లో పోలీసు అధికారిగా, మ‌రో పాత్ర‌లో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా క‌నిపించ‌నున్నారు. ముంబై నేప‌థ్యంలో సాగే చిత్రం ద‌ర్భార్ కాగా, ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ ముంబైలోనే జ‌రిపారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌లోను చిత్ర షూటింగ్ జ‌రిపడం విశేషం. నేటితో చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.


ద‌ర్భార్ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్రంలో యువ‌రాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ , విజ‌య్ సేతుప‌తి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నార‌ట‌. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles