మోదీ బ‌యోపిక్‌కి క్లియ‌రెన్స్ ఇవ్వ‌ని సుప్రీం కోర్టు

Fri,April 26, 2019 01:05 PM
Supreme Court Refuses to Lift Ban on Release of PM Modi Biopic

పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఎన్నిక‌ల కోడ్ న‌డుస్తున్న క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఈ చిత్రాన్ని కొన్నాళ్ళపాటు నిషేదించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు మోదీ బయోపిక్‌ను రిలీజ్ చేయొద్దని ఇటీవ‌ల‌ ఈసీ త‌న నిర్ణ‌యం తెలిపింది . ఈ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీ తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేఖంగా మేము తీర్పు ఇవ్వ‌లేం. ఎల‌క్ష‌న్ ప‌రిధిలో ఉన్న విష‌యంపై చ‌ర్చించ‌డం త‌గ‌దు. మూవీ విడుద‌ల‌కి సంబంధించిన విష‌యాల‌ని ఈసీనే చూసుకుంటుంద‌ని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

పీఎం న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌లో మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, ముఖ్య పాత్ర‌ల‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌టిస్తున్నారు. భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్ర‌ని మనోజ్ ‌జోషి చేస్తున్నాడు. మోదీ తల్లి హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ క‌నిపించ‌నుంది. ఇక భార్య‌ జశోదాబెన్‌ పాత్రని బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా చేస్తుంది. ప్ర‌తినాయ‌కుడి పాత్రలో మ‌ర్డ‌ర్ 2 ఫేం ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్ న‌టిస్తున్నారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం 23 భాష‌ల‌లో విడుద‌ల కానున్న‌ట్టు టాక్.

900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles