అనాథ పిల్ల‌ల‌తో హాలీవుడ్ సినిమా చూసిన మెగా హీరో

Thu,May 2, 2019 08:58 AM
Supreme Hero  arranged special screening of Avengers End Game

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ చాన్నాళ్ళ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న తేజూ రీసెంట్‌గా కొంత‌మంది అనాథ పిల్ల‌ల‌తో పాటు త‌న స్నేహితుడు న‌వీన్, సోద‌రుడు వైష్ణ‌వ్‌తో క‌లిసి హాలీవుడ్ చిత్రం అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ వీక్షించారు. పిల్ల‌ల‌తో సినిమా చూడ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని తేజూ అన్నాడు. పిల్ల‌లు సినిమా చూసేందుకు స‌హ‌క‌రించిన థియేట‌ర్ యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. పిల్ల‌లకి స‌మాజిక బాధ్య‌త తెలియజేయాల‌నే ఉద్దేశంతో వారంద‌రికి చిన్న మొక్క‌లు కూడా అందించిన‌ట్టు తెలుస్తుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ వంటి మంచి హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన మారుతి ఇప్పుడు తేజూ కోసం స‌రికొత్త కాన్సెప్ట్‌తో క‌థ‌ని రెడీ చేస్తున్న‌ట్టు టాక్.

1519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles