సైరాలో అమితాబ్ పార్ట్ పూర్తి.. ఆయ‌న‌తో ప‌నిచేయడం గ‌ర్వంగా ఉంద‌న్న ద‌ర్శ‌కుడు

Sun,March 17, 2019 07:53 AM

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్ర సైరా. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చిరంజీవి, అమితాబ్ బచ్చ‌న్, న‌య‌న‌తార‌, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి,త‌మ‌న్నా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషిస్తున్న అమితాబ్ గ‌త ఏడాది జ‌రిగిన ఓ షెడ్యూల్‌లో కొద్ది రోజులు పాల్గొన్నారు. తాజాగా ఆయ‌న మ‌రోసారి టీంతో క‌లిసారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన అమితాబ్‌ని చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. సీన్లు గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా ఆయ‌న పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి కావ‌డంతో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి అమితాబ్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. అమితాబ్‌తో అద్భుత ప్ర‌యాణం సాగింది. సైరాలో మీరు భాగం అయినందుకు సంతోషంగా ఉంది. మీతో ప‌నిచేయ‌డం మేము గౌరవంగా ఫీల‌వుతున్నాము అని సురేంద‌ర్ రెడ్డి త‌న ట్వీట్‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ శివార్ల‌లో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతుంది. ఈ నెల‌లో జ‌రిపే షూటింగ్‌తో 95 శాతం సినిమా పూర్త‌వుతుంద‌ని అంటున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు.
1962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles