రూమ‌ర్స్‌కి బ్రేక్ వేసిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌

Tue,May 7, 2019 12:22 PM
suresh productions official announcement on venky movie

మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క‌ద్వ‌యం పుష్క‌ర్-గాయ‌త్రి తెర‌కెక్కించిన చిత్రం విక్ర‌మ్ వేదా. విక్ర‌మ్, భేతాళ క‌థ‌ల‌ని ఆధారంగా తీసుకొని త‌మిళంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధించింది. వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంద‌ని కొన్నాళ్ళ నుండి ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా వెంకటేష్‌, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రీమేక్ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌కుడు అని అన్నారు మాధ‌వ‌న్ పాత్ర‌లో నారా రోహిత్ న‌టిస్తే, విజయ్ సేతుప‌తి పాత్ర‌లో వెంకీ న‌టిస్తార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. విక్ర‌మ్ వేదా తెలుగు రీమేక్‌లో వెంకీ న‌టిస్తాడ‌ని వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వం. ప్ర‌స్తుతం వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో వెంక‌టేష్ బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌కి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌.



2465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles