ఎన్టీఆర్ బ‌ర్త్‌డే రోజున ఆర్ఆర్ఆర్ నుండి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌

Sat,May 18, 2019 11:58 AM

మే 20న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కాగా, ఆ రోజున జూనియ‌ర్ బ‌ర్త్‌డే వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అభిమానులు భావించారు. కాని గత ఏడాది ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో నల్గొండ సమీపంలోని నార్కేట్‌పల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని జూనియర్‌ ఎన్టీఆర్‌ నిర్ణయించారు. అయితే అభిమ‌నులు మాత్రం ఆ రోజు అన్న‌దానాల‌తో పాటు ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల‌ని చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రంలో ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ లుక్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్నాడు.

2935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles