బిగ్ బాస్ హౌజ్‌లోకి రీఎంట్రీ.. ఆ వ్యక్తి ఎవ‌రో తెలుసా?

Thu,September 26, 2019 11:50 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 సక్సెస్ ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని రీసెంట్‌గా ప‌దోవారంలోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఇంట్లో తొమ్మిది మంది స‌భ్యులు ఉన్నారు. ఈ వారం నామినేష‌న్‌లో శ్రీముఖి, బాబా భాస్క‌ర్, వ‌రుణ్ సందేశ్ , ర‌వికృష్ణ ఉండ‌గా ఇందులో ఒక‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌నున్నారు. అయితే తాజాగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్రోమో విడుద‌లైంది. ఇంటి స‌భ్యుల‌కి స‌ర్‌ప్రైజ్ ట్విస్ట్ అంటూ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో క‌నిపిస్తున్న వ్య‌క్తి హౌజ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్రేక్ష‌కులు ముచ్చ‌టించుకున్నారు. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతుంది.


బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్ర‌వేశించిన త‌మ‌న్నా, శిల్ప చ‌క్ర‌వ‌ర్తి పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. దీంతో నిర్వాహ‌కులు కొత్త వ్య‌క్తిని కాకుండా ఇంటి నుండి వెళ్లిపోయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే బిగ్ బాస్ హౌజ్‌లోకి పంప‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కి అలీ రెజా నేడు ఇంట్లోకి ప్ర‌వేశించి హౌజ్‌మేట్స్‌కి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై మ‌రి కొద్ది గంట‌ల‌లో క్లారిటీ రానుంది. కాగా, ఈ వారం నామినేషన్‌లో ఉన్న న‌లుగురిలో ర‌వికృష్ణ‌నే కాస్త వీక్ కంటెస్టెంట్‌గా క‌నిపిస్తుండ‌డంతో ఆయ‌న ఈ ఆదివారం ఎలిమినేట్ కానున్నాడని నెటిజ‌న్స్ చెబుతున్నారు.9329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles