బిగ్ బాస్ 3కి బ్రేక్ ప‌డ‌నుందా ?

Sun,July 21, 2019 07:33 AM
suspense on bigg boss 3

తెలుగులో తొలి రెండు సీజ‌న్స్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇప్పుడు మూడో సీజ‌న్‌కి సిద్ధ‌మైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్ర‌మం నేటి నుండి ప్రారంభం కానుంది. 15 మంది సెల‌బ్రిటీల‌తో వంద రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఆపేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి, నటీమణి గాయ‌త్రి గుప్తా షో నిర్వాహ‌కుల‌పై కేసులు కూడా పెట్టడం, సభ్యుల పట్ల నిర్వాహకులు తప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఉస్మానియా విద్యార్థులు మానవ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో ఈ షో నేడు ప్ర‌సారం అవుతుందా లేదా అనే దానిపై అనుమానాలు మొద‌ల‌య్యాయి . ఇప్ప‌టికే నాగ్ ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్ధులు బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మానికి నాగ్ హోస్ట్‌గా కొన‌సాగిస్తే అన్న‌పూర్ణ స్టూడియో ముందు ధ‌ర్మా చేస్తామ‌ని అంటున్నారు. ప‌రిస్థితులు కాస్త సీరియ‌స్ అవుతుండ‌డంతో బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మంకి నాగ్ వ్యాఖ్యాత‌గా ఉంటాడా, ఈ షో చెప్పిన టైంకి ప్ర‌సారం అవుతుందా అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి కొద్ది గంట‌ల‌లో దీనిపై పూర్తి క్లారిటీ వ‌స్తుంది.

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles