సైరా షూటింగ్ లొకేష‌న్ హైద‌రాబాద్‌కి షిప్ట్‌..!

Tue,February 26, 2019 12:40 PM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని కర్ణాటకలోని బీదర్‌లోని బహుమనీ సుల్తాన్‌ కోటలో జ‌ర‌పాల‌ని భావించింది చిత్ర బృందం. కాని కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారని యువకులు అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగేలా చేశారు. అయితే కోట‌లో హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బందం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతం అయిన కోకాపేట‌లో స్పెష‌ల్ సెట్ వేసి అక్క‌డ చిత్రీక‌ర‌ణ‌ని కొన‌సాగించాల‌ని అనుకుంటుంద‌ట. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. ణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నా ఈ ,చిత్రంలో చిరుతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

2562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles