మ‌రోసారి వాయిదా ప‌డ్డ సైరా వేడుక‌.. 22న ఫిక్స్ !

Tue,September 17, 2019 10:01 AM

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రం సైరా. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక క‌ర్నూలులో జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని వాతావ‌ర‌ణం అనుకూలించ‌ని కార‌ణంగా సెప్టెంబ‌ర్ 18న హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జ‌ర‌ప‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. కాని తాజాగా అఖిత భార‌త చిరంజీవి య‌వ‌త సెప్టెంబ‌ర్ 22న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఈ రెండు రోజుల‌లో తెలంగాణ‌లో భారీ వర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్న నేప‌థ్యంలో వేడుకని పోస్ట్ పోన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.


సైరా ప్రీ రిలీజ్ వేడుక‌ అవుట్ డోర్ లో జ‌రుగుతుంది కాబట్టి వాతావరణం అనుకూలిస్తే తప్ప ఆ ఫంక్షన్ సజావుగా జరగదు. ఈ క్ర‌మంలో వేడుక‌ని వాయిదా వేసి ఉంటార‌ని భావిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుక‌కి వేడుకకు తెలంగాణ ఐటీ మంత్రి, రామ్ చరణ్ స్నేహితుడు కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి, సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌.. అతిథులుగా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ త‌ర్వాత కేటీఆర్ హాజ‌రు కావడం లేద‌ని అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌ర్ 18న కేటీఆర్ వేరే కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేద‌ని, 22న అయితే ఆయ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంకి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

1074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles