ఘ‌నంగా సైరా ప్రీ రిలీజ్‌.. కేటీఆర్ హాజ‌రు కావ‌డం లేద‌ని ప్ర‌క‌ట‌న‌

Fri,September 13, 2019 08:54 AM

తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేసి అంచ‌నాలు పెంచిన చిత్ర బృందం, సెప్టెంబ‌ర్ 21న క‌ర్నూలులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌పాల‌ని యోచించింది. కాని వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు స‌రిగా లేని కార‌ణంగా వేదిక‌ని మార్చిన‌ట్టు తెలుస్తుంది.


తాజాగా చిత్ర బృందం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే ఈ వేడుకకు తెలంగాణ మంత్రి, రామ్ చరణ్ స్నేహితుడు కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి, సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌.. అతిథులుగా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ కొద్ది సేప‌టికే .. ‘‘ అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్ల కేటీఆర్‌గారు సైరా ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హ‌జ‌రు కావ‌డం లేదు..’’ అని కొణిదెల పీఆర్వో అఫీషియల్ ట్విట్టర్‌లో తెలి పారు. చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తి బాబు, అమితాబ్ బ‌చ్చ‌న్, నిహారిక, సుదీప్ ,విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాప పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు.

2124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles