గ‌డ్డి ప‌రక కూడా గ‌డ్డ దాట‌కూడ‌దు..సైరా ట్రైల‌ర్2

Thu,September 26, 2019 10:53 AM

అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చారిత్రాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. కొద్ది రోజుల క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో చిరు డైలాగ్స్ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి . యాక్షన్‌ సీన్స్‌లో చిరు చెప్పిన గ‌డ్డి ప‌రక కూడా గ‌డ్డ దాట‌కూడ‌దు అనే డైలాగ్ అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.


తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న సైరా చిత్రంలో చిరంజీవి, న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. భారీ బ‌డ్జెట్ చిత్రంగా సైరా రూపొంద‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం 280 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని ఇన్‌సైడ్ టాక్. చిరంజీవి రెమ్యున‌రేష‌న్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసార‌ని చెబుతుండ‌గా, సినిమా లాభాల‌లో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌ర‌గ‌గా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ చిత్రాన్ని నిర్మించిన విష‌యం విదిత‌మే.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles