ఈ ఫోటోపై మీ కామెంట్ ఏంటి?

Wed,August 21, 2019 08:42 AM

రానున్న రెండు నెల‌లో విడుద‌ల కానున్న చిత్రాలు సాహో, సైరా న‌ర‌సింహారెడ్డి తెలుగు సినిమా ప్ర‌తిష్టని రెట్టింపు చేస్తాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌గా, రెండింటిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల సాహో ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రీసెంట్‌గా విడుద‌లైన సైరా టీజ‌ర్‌కి కూడా ఫుల్ అప్లాజ్ ల‌భిస్తుంది. సాహో చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా, సైరా చిత్రాన్ని కూడా అన్ని భాష‌ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే సైరా టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్ళిన చిరు, రామ్ చ‌రణ్‌... సాహో ప్ర‌మోష‌న్‌లో భాగంగా ముంబైలో ఉన్న ప్రభాస్ ఒక్క‌చోట క‌లిసారు. వీరు ముగ్గురు ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో క‌నిపిస్తుండే స‌రికి అభిమానుల ఆనందానికి అవ‌ధులు అనేవి ఉండ‌డం లేదు. రామ్ చ‌ర‌ణ్ ..సైరా చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న విష‌యం విదిత‌మే.

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles