చరిత్ర స్మరించుకుంటుంది..సైరా టీజర్ అదిరింది

Tue,August 20, 2019 02:39 PM
Syera Narasimhareddy teaser released

తెలుగు సినిమా చరిత్ర‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లికించుకున్న వీరుడు, ధీరుడు మెగాస్టార్ చిరంజీవి. ఆరు ప‌దుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరు తొలిసారి త‌న కెరీర్‌లో చారిత్రాత్మ‌క చిత్రం చేశాడు. తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌మాధారంగా సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ కొద్ది సేపటి క్రితం విడుద‌లైంది.

‘చరిత్ర స్మరించుకుంటుంది..ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు’అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయే టీజర్ యుద్ద సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తున్నాయి. చారిత్రక వీరుడి ఘ‌న‌త‌ను ప‌రిచ‌యం చేసే వ్యాఖ్యాలు ప‌వ‌న్ వాయిస్‌తో రావ‌డం మెగా అభిమానుల ఆనందానికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాయి.

సైరా నరసింహారెడ్డి పాత్ర‌లో చిరంజీవి ఒదిగిపోయారు. ఆయ‌న క‌త్తి ప‌ట్టిన శ‌త్రువుల మీద దండ‌యాత్ర చేస్తున్న స‌న్నివేశాలు సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచాయి. అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అల‌రిస్తుంది. మొత్తంగా చిరు బ‌ర్త్‌డే కానుక‌గా విడుద‌లైన సైరా టీజ‌ర్ అభిమానుల‌కి మంచి ట్రీట్ ఇచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌యనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి. ఆ నాటి రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సైరా తెర‌కెక్క‌డం గ‌మ‌న‌ర్హం. ర‌త్న‌వేలు చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.


2582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles