కేర‌ళలో సైరా టీం.. చివ‌రి షెడ్యూల్‌తో బిజీ బిజీ

Sat,April 20, 2019 08:48 AM
SyeRaa final schedule is underway in Kerala

చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అన్ని భాషల అగ్రనటులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుదీప్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా , జ‌గ‌ప‌తి బాబు వంటి స్టార్స్ చిత్రంలో న‌టిస్తుండే స‌రికి ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ కేరళలోని చాలకూడిలో సైరా మూవీ చిత్రీకరణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. తాజాగా న‌టుడు చ‌ర‌ణ్‌దీప్ పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. దీంతో ఆయ‌న చిరుతో పాటు టీంతో ప్ర‌యాణం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలిపాడు. ఈ సినిమా త‌న‌కి జీవితంలో ఎప్ప‌టికి గుర్తుండిపోతుంద‌ని పేర్కొన్నాడు. ఆంగ్లేయులను ఎదిరించిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ .. నరసింహారెడ్డి రాజగురువు గోసాయి వెంకన్న పాత్రలో క‌నిపించ‌నుండ‌గా, జ‌గ‌ప‌తి బాబు పోరాటయోధుడు వీరారెడ్డి పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నారు. మే నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తిచేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అమిత్‌త్రివేది స్వరకర్త. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles