యాక్షన్ సన్నివేశాలతో ‘సైరా’ మేకింగ్ వీడియో

Wed,August 14, 2019 04:14 PM
syeraa narsimhareddy making vedio revealed


మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో తీసిన భారీ యాక్షన్ సన్నివేశాలతో విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సైరా కాస్ట్యూమ్స్ డిజైనింగ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్మణ్ నేతృత్వంలో తీసిన యాకన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ తోపాటు కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, ర‌వి కిష‌న్‌, న‌య‌న‌తార ,త‌మ‌న్నా, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆగస్టు 20న సైరా టీజర్ ప్రేక్షకుల ముందుకురానుంది. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles