న‌మ‌స్తే తెలంగాణ ఆఫీసుకు సైరా డైర‌క్ట‌ర్‌

Wed,October 16, 2019 06:21 PM

హైద‌రాబాద్‌: సూప‌ర్‌హిట్ మూవీ సైరా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సురేంద‌ర్ రెడ్డి.. ఇవాళ న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌చ్చారు. ప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టాశేఖ‌ర్ రెడ్డితో సురేంద‌ర్ రెడ్డి కాసేపు ముచ్చ‌టించారు. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన సురేంద‌ర్ రెడ్డి.. తెలంగాణ నేప‌థ్యానికి సంబంధించిన అనేక అంశాల‌ను ఎడిట‌ర్‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎడిట‌ర్ శాలువా క‌ప్పి సురేంద‌ర్ రెడ్డిని స‌న్మానించారు. ఆ త‌ర్వాత ఎడిట‌ర్ చైర్‌లో కూర్చున్న డైర‌క్ట‌ర్‌.. గెస్ట్ ఎడిట‌ర్ పాత్ర‌ను పోషించారు. ఇటీవ‌ల రిలీజైన సైరా చిత్రానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను ఆయ‌న చ‌ర్చించారు. సైరా సినిమా నిర్మాణ స‌మ‌యంలో ఎన్నో చిక్కులు ఎదుర‌య్యాయ‌ని, రెండున్న‌ర సంవ‌త్స‌రాలు పాటు సినిమా నిర్మాణం సాగింద‌ని సురేంద‌ర్ తెలిపారు. సైరా సినిమాతో.. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌థ‌ల‌ను తీయ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం పెరిగింద‌ని డైర‌క్ట‌ర్ చెప్పారు. తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను కూడా వెండితెర‌పై చూపించే క‌థ‌లు ఇక్క‌డ ఎన్నో ఉన్నాయ‌న్నారు. న‌మ‌స్తే తెలంగాణ ఆప‌రేష‌న్స్ జీఎం సీహెచ్‌ శ్రీనివాస్‌, ఫీచర్స్ ఎడిటర్ న‌గేశ్ బీ రెడ్డి, ఫిల్మ్ డెస్క్ ఇంచార్జ్ మ‌ధు కూడా సురేంద‌ర్ రెడ్డితో ప‌లు అంశాల‌పై మాట్లాడారు.


1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles