సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్న క‌రీనా త‌న‌యుడు

Tue,April 2, 2019 08:26 AM

క‌రీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్‌కి పుట్టిన‌ప్ప‌టి నుండే విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆయ‌న బ‌య‌టకి వ‌చ్చాడంటే కెమెరాల‌న్నీ తైమూర్‌నే ఫాలో అవుతుంటాయి. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న తైమూర్‌ని చూసుకోవ‌డం కోసం రూ.1.75 లక్షలు ఇచ్చి మ‌రీ ఓ మ‌హిళ‌ని ఉద్యోగంలో పెట్టుకున్నార‌ట సెల‌బ్రిటీ క‌పుల్‌. ఇటీవ‌ల‌ కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో తైమూర్‌ బొమ్మలు దర్శనమిచ్చాయంటే ఆ బుడ‌త‌డ‌కి ఉన్న ఫాలోయింగ్ ఏ పాటిదో అర్దం చేసుకోవ‌చ్చు. అయితే అప్ప‌ట్లో తైమూర్ పేరుతో సినిమా రానుంద‌నే వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ‘ఫ్యాషన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించిన మధుర్‌ భండార్కర్ తైమూర్ పేరుతో సినిమా తీయ‌నున్నార‌ని, అందులో ప‌టౌడీ కుటుంబంలోని నేటి త‌రం న‌టులు న‌టించ‌నున్నార‌ని అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ‘గుడ్‌ న్యూస్‌’లో చిన్న గెస్ట్‌ రోల్‌ చేయనున్నాడట తైమూర్. అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్ జంటగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పది నిమిషాల పాటు ఈ బుడ‌త‌డు సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే తైమూర్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తైంద‌ని త్వ‌ర‌లోనే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు.

1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles