ఒకే రోజు రెండు హార‌ర్ చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్న త‌మ‌న్నా

Tue,May 21, 2019 10:08 AM
Tamannaah Bhatia entertain with horror movies

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి చిత్రం త‌ర్వాత పెద్ద సినిమాల‌లో న‌టించిన దాఖ‌లాలే లేవు. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ప్ర‌భుదేవాతో క‌లిసి దేవి2 ( అభినేత్రి 2) అనే సినిమా చేసింది. త‌మిళంలో మంచి స‌క్సెస్ సాధించిన దేవి చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. మ్యూజిక‌ల్ హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఐషారీ కే గ‌ణేష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే రోజు త‌మ‌న్నా న‌టించిన మ‌రో హార‌ర్ చిత్రం ఖామోషి విడుద‌ల కానుంది. చ‌క్రి తోలేటి తెర‌కెక్కించిన ఈ చిత్రం 2017లోనే సెట్స్ పైకి వెళ్ళిన ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కి ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. చిత్రంలో ప్ర‌భుదేవా, భూమిక‌, సంజ‌య్ సూరీ, ముర‌ళీ శ‌ర్మ‌ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. చిత్రంలో ప్ర‌భుదేవా సైకో పాత్ర‌లో క‌నిపించి బ‌య‌పెట్టించ‌నున్నాడు. త‌మ‌న్నా బ‌ధిర యువ‌తిగా క‌నిపించ‌నుంది. మొత్తానికి ఒకే రోజు రెండు హార‌ర్ చిత్రాల‌తో త‌మ‌న్నా సంద‌డి చేయ‌నుండ‌డం విశేషం.

1647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles