మరోసారి ప్రత్యేక గీతంలో తమన్నా..!

Wed,May 23, 2018 07:17 PM

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగచైతన్య తాజాగా సవ్యసాచి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. మిల్కీ బ్యూటీ తమన్నా సవ్యసాచిలో కనిపించనుందట. సవ్యసాచి కోసం మరోసారి ప్రత్యేక గీతంలో కనిపించి సందడి చేయనుందట తమన్నా. అయితే దీనికి సంబంధించి చిత్రయూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తమన్నా ఇప్పటికే జై లవకుశ, స్పీడున్నోడు చిత్రాల్లో ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసి అలరించింది.

3645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles