బిగ్ బాస్ 3ని సెన్సార్ చేయాల‌ని డిమాండ్

Thu,June 20, 2019 10:55 AM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో సీజ‌న్ 3 జూలైలో మొద‌లు కానుండ‌గా, త‌మిళంలో జూన్ 23న ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ గేమ్ షోలో అశ్లీలంగా బ‌ట్ట‌లు ధరించ‌డంతో పాటు అస‌భ్య ప‌దజాలం వంటివి వాడుతున్నార‌ని , వీటి వ‌ల‌న ప్రేక్ష‌కులు చెడు దారి ప‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని సుద‌న్ అనే న్యాయ‌వాది త‌మిళ‌ బిగ్‌బాస్‌–3 రియాలిటీ షోను నిషేధించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.అంతే కాదు ఈ రియాలిటీ షోను సెన్సార్‌ చేయించి ప్రసారం చేయాలని కోరారు. అంతవరకూ రియాలిటీ షో ప్రసారంపై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచార‌ణ‌కి స్వీకరించిన న్యాయ‌స్థానం విజయ్‌ టీవీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సెన్సార్‌ బోర్డుకు రిట్‌ పిటిషన్‌ దాఖాలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. త‌మిళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి క‌మ‌ల్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

2093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles