తృటిలో పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ విజ‌య్

Thu,March 14, 2019 09:57 AM
Tamil romantic hero is safe from his fans

త‌మిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో త‌ల‌ప‌తి విజ‌య్ ఒక‌రు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం త‌న 63వ సినిమాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్క‌డ విజ‌య్‌కి ఓ వింత అనుభ‌వం ఎదురైంది. త‌న‌ని చూడ‌టానికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించేందుకు విజ‌య్ వారి ద‌గ్గరికి వెళ్లాడు. అయితే ఇటు విజ‌య్‌కి , అభిమానుల‌కి మ‌ధ్య ఓ ఇనుప కంచె అడ్డంగా ఉంది. భారీగా గుమిగూడిన అభిమానులు విజ‌య్ రాగానే ఒక్క‌సారిగా కంచె వైపు దూసుకురావ‌డంతో విజయ్ పై కంచె ఒరిగింది. వెంట‌నే తాను కంచె ప‌డ‌కుండా రెండు చేతుల‌తో ఆప‌బోయాడు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న బాడీ గార్డులు కూడా విజ‌య్‌కి సాయ‌ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కంచె క‌నుక విజ‌య్ మీద ప‌డి ఉంటే, ఆ స‌మ‌యంలో అభిమానులు ఒక్క‌సారిగా దూసుకొచ్చింటే ప‌రిస్థితి వేరేలా ఉండేదేమో అని నెటిజ‌న్స్ అంటున్నారు. విజ‌య్‌కి గ‌తంలో ఇలాంటి అనుభ‌వాలే చాలా ఎదుర‌య్యాయి. ఓ అభిమాని పెళ్లికి వెళ్ళ‌గా , అక్క‌డ‌ తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో విజ‌య్‌కి గాయాలు అయ్యాయి. ప్ర‌స్తుతం విజ‌య్ చేస్తున్న 63వ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.3981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles