తనుశ్రీ దత్తాకు హార్వర్డ్ స్కూల్ నుంచి ఆహ్వానం

Sun,February 10, 2019 07:13 PM
Tanushree Dutta Invited to Harvard business school

మీ టూ ఉద్యమంతో తన గళం విప్పిన ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆహ్వానం అందింది. ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించాల్సిందిగా బోస్టన్ హార్వర్డ్ స్కూల్ తను శ్రీని ఆహ్వానించింది.బోస్టన్ హార్వర్డ్ స్కూల్ సదస్సులో మాట్లాడాలని నాకు ఆహ్వానం వచ్చింది. హార్వర్డ్ బిజినెస్, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డిగ్రీ విద్యార్థులు నిర్వహిస్తున్న ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 16న జరుగనుందని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది తనుశ్రీ. తను శ్రీ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ సినిమా సెట్స్ లో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో..బాలీవుడ్ లో పెద్ద ఎత్తున మీ టూ ఉద్యమం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తను శ్రీ వ్యాఖ్యలతో హిందీ చలన చిత్ర పరిశ్రమలో భారీ గా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత పలువురు నటీమణులు కూడా తమకు ఎదురైన ఛేదు అనుభవాలను పంచుకున్నారు.

2276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles