ఎట్ట‌కేల‌కి మ‌రో సినిమాకి సైన్ చేసిన టాక్సీవాలా గార్ల్‌

Sat,August 24, 2019 11:11 AM
Taxiwaala Fame Priyanka Jawalkar Signs Her Next

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కిన టాక్సీవాలా చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ ప్రియాంక జ‌వాల్క‌ర్. ఈ చిత్రంలో ప్రియాంక న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఈ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాకి సైన్ చేసేందుకు చాలా టైం తీసుకుంది. తాజాగా ఈ అమ్మ‌డు సృజ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాకి సైన్ చేసింద‌ట‌. ఇందులో శివ కందుకూరితో జ‌త క‌ట్టేందుకు ప్రియాంక జ‌వాల్క‌ర్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో ప్రియాంక ముస్లిం యువ‌తి పాత్ర‌లో క‌నిపించి క‌నువిందు చేయ‌నుంద‌ట‌. జ్ఞాన శేఖ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నున్నారు. ఈ చిత్రంలో శ్రియా శ‌ర‌న్ కూడా ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

1864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles