'స‌రిలేరు నీకెవ్వ‌రు' ఫ్యామిలీ ఫోటో అదిరింది

Sat,November 9, 2019 08:15 AM

మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల కేర‌ళ‌కి వెళ్లిన చిత్ర బృందం శుక్ర‌వారంతో ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో మ‌హేష్ బాబు, ర‌ష్మిక‌, ప్ర‌కాశ్ రాజ్, అనీల్ రావిపూడి, విజ‌య‌శాంతి, రాజేంద్ర‌ప్రసాద్, సంగీత త‌దిత‌రులు ఉన్నారు. చిత్రంలో మహేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు స‌రికొత్త రికార్డ్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. చిత్ర పోస్ట‌ర్‌కి ఎక్కువ లైక్స్ రాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఇదే హ‌య్యెస్ట్ అని అంటున్నారు.

1582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles