'తేజ్ ఐ ల‌వ్ యూ' ఫేర్‌వెల్ ఫోటో

Sun,May 27, 2018 07:18 AM

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది. క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్ న‌డుస్తుంది. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాత‌లు అన్నారు. అయితే చిత్ర షూటింగ్ రీసెంట్‌గా పూర్తి అయింది. చివ‌రి రోజు యూనిట్ అంద‌రు క‌లిసి గ్రూప్ ఫోటో దిగారు. దీనికి ఫేర్‌వెల్ ఫోటో అని పేరు పెట్టారు. ఈ పిక్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది. ఇటీవ‌ల విడ‌దులైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి ఉంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఆడియో వేడుక కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

2579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles