బిగ్ బాస్ హౌజ్‌లో సాయిధ‌ర‌మ్, అనుప‌మ‌

Thu,July 5, 2018 01:30 PM
teju enter into bigg boss

నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం రోజు రోజుకి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. వీకెండ్‌లో నాని సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మాంచి ఫ‌న్ అందిస్తుంటే మిగతా రోజుల‌లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నాయి. ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమా ప్ర‌మోషన్స్‌లో భాగంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్ళి హంగామా చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం జంబ‌ల‌కిడి పంబ టీం స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లగా, ఇప్పుడు తేజూ, అనుప‌మ‌లు ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు.

తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి తేజూ, అనుప‌మ‌లు సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మం నేడు ప్ర‌సారం కానుంది. కొద్ది సేప‌టి క్రితం ప్రోమో విడుద‌ల చేశారు. హౌజ్‌లోకి తేజూ ఎంట్రీ ఇవ్వ‌డంతోనే ఇంటి స‌భ్యుల ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. బావ నాకోసం కేక్ తీసుకురాలేదా అని తేజ‌స్వీ , సాయిధ‌ర‌మ్ తేజ్‌ని అడ‌గ‌గా అందుకు తేజూ నేను రావ‌డ‌మే ఎక్కువ అని అంటాడు. సామ్రాట్‌తో బౌలింగ్ బాగా వేస్తున్నావ‌ని అన్న తేజూ, త‌నీష్‌ని గిటార్ బాగానే వేయిస్తున్నావ్ అని చ‌మ‌త్క‌రించాడు. ఇక అనుప‌మ త‌న పాట‌తో ఇంటి స‌భ్యుల‌ని ఇంప్రెస్ చేసింది.3160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles