శివ‌జ్యోతిపై బిగ్ బాస్ సీరియ‌స్.. రెండు వారాల పాటు నామినేష‌న్‌లో

Tue,August 13, 2019 08:24 AM
Tension breaks out in the house when Shiva Jyothi and Rohini

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం ప‌ద‌హారు మంది స‌భ్యులు ఇంట్లోకి ప్ర‌వేశించ‌గా అందులో తొలివారం హేమ‌, రెండో జాఫ‌ర్‌, మూడో వారం త‌మ‌న్నా ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళారు. ఇక ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ గ‌త వారాల‌కి భిన్నంగా జ‌ర‌గ‌గా ప్ర‌స్తుతం నామినేషన్‌లో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఉన్నారు. ఈ ఏడుగురులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు.

ఎపిసోడ్ 23 హైలైట్స్ విష‌యానికి వ‌స్తే ఇంట్లో ఓ వైపు వ‌రుణ్‌, వితికాల రొమాన్స్ న‌డుస్తుంటే మ‌రో వైపు బిగ్ బాస్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. ఎలిమినేష‌న్ చేసేందుకు ఇద్ద‌రు ఇంటి స‌భ్యులు క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్ళి ఇద్ద‌రిలో ఎవ‌రు ఎలిమినేట్ కావాల‌నుకుంటున్నారో చెబుతారు. అయితే శ్రీముఖి వ‌ల‌న ర‌వికి గాయం కావ‌డంతో ఆమె డైరెక్ట్‌గా నామినేట్ అయింది. ఇక అలీ, పున‌ర్న‌వి స‌క్సెస్ ఫుల్‌గా సీక్రెట్ టాస్క్ పూర్తి చేయ‌డంతో వారిద్ద‌రు ఈ వారం ఎలిమినేష‌న్ నుండి సేఫ్ అయ్యారు.

ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ముందుగా ర‌వికృష్ణ‌, వితికాలు క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్లగా.. ర‌వి గ‌త వారం తాను చేసిన త‌ప్పుకి త‌న‌కి తానుగా నామినేట్ చేసుకున్నాడు. దీంతో వితికా సేఫ్ అయింది. ఇక రోహిణి, శివ‌జ్యోతి జంట‌గా వెళ్ల‌గా వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంతో శివ‌జ్యోతి నామినేట్ అయింది. ఆ త‌ర్వాత .. వరుణ్, మహేష్ జోడీగా వెళ్లగా ఇద్ద‌రి మ‌ధ్య కొద్దిసేపు వాదోప‌వాదాలు జ‌రిగాయి. చివ‌రికి వ‌రుణ్ నామినేట్ కాగా, మ‌హేష్ సేఫ్ అయ్యాడు. బాబా భాస్కర్, అషు‌ రెడ్డిలు జంటగా వెళ్లగా.. ఇంట్లో ఏం జ‌రుగుతుందో చూడ‌డానికి వ‌చ్చాన‌ని , ఇప్పుడు వెళ్ళిన నాకేం ప‌ర్లేద‌ని బాబా చెబుతూ త‌న‌కి తాను నామినేట్ చేసుకున్నాడు.

అయితే బాబా భాస్క‌ర్ త‌న‌కి తాను నామినేట్ చేసుకోక‌పోయిన నేను ప‌క్కా చేసేదానిని అని అషూ చెప్పింది. కిచెన్ టీమ్ విషయంలో ఆయన చెప్పిన సమాధానం నాకు న‌చ్చ‌క‌పోవ‌డంతో నామినేట్ చేసేందుకు సిద్ద‌మ‌య్యాన‌ని అషూ పేర్కొంది. ఇక ఆ త‌ర్వాత హిమజ, రాహుల్‌లు జంటగా వీరిలో రాహుల్ నామినేట్ కాగా.. హిమజ సేఫ్ అయ్యింది. ఫైన‌ల్‌గా నాలుగోవారానికి గాను ఎలిమినేష‌న్ జోన్‌లో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఉన్నారు.

ఇంట్లో రూల్స్ బ్రేక్ చేయోద్ద‌ని బిగ్ బాస్ ప‌దే ప‌దే చెబుతున్న‌ప్ప‌టికి వాటిని బేఖాత‌రు చేస్తున్నారు ఇంటి స‌భ్యులు. ఈ సారి రోహిణి, శివ జ్యోతి విష‌యంలో బిగ్ బాస్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ గురించి ఇంటి స‌భ్యుల‌తో చ‌ర్చించొద్ద‌ని బిగ్ బాస్ ఆదేశించిన‌ప్ప‌టికి శివజ్యోతి, రోహిణిలు ఇంట్లో నామినేషన్‌ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. దీనిపై సీరియ‌స్ అయిన బిగ్ బాస్ ఇంటి నియ‌మాల‌ని ఉల్లంఘించినందుకు రోహిణి, శివ‌జ్యోతిల‌ని ఈ వారంతో పాటు వ‌చ్చేవారం నామినేట్ చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రోహిణి ఈ వారం సేఫ్ అయిన‌ప్ప‌టికి త‌ను చేసిన త‌ప్పు కార‌ణంగా రెండు వారాల పాటు నామినేట్ కావ‌డం గ‌మ‌న‌ర్హం.

సోమ‌వారం బక్రీద్ కావ‌డంతో ఇంటి స‌భ్యుల‌కి చిన్న స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్‌. ఒక్కో కంటెస్టెంట్‌కి సంబంధించిన చిన్ననాటి ఫొటోలను, వారి ఫ్యామిలీ ఫొటోలను చూపించి ఆనందింప‌జేశారు. అయితే కొంద‌రు మాత్రం పాత జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. ముఖ్యంగా ఎమోష‌న్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శివ‌జ్యోతి మళ్ళీ త‌న క‌న్నీటి కుళాయి తిప్పింది. నేటి ఎపిసోడ్‌లో కెప్టెన్ ఎంపిక‌ కోసం బిగ్ బాస్ ఫిజిక‌ల్ టాస్క్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మరి ఈ టాస్క్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుందో చూడాలి.

4622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles