‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ తెలుగు ట్రైలర్

Wed,October 16, 2019 07:15 PM

‘టెర్మినేటర్’ సిరీస్ లో సినిమాలు అనగానే అందరికీ గుర్తొచ్చే హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్. టెర్మినేటర్ సిరీస్ చిత్రాల్లో ఆర్నాల్డ్ యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా టర్మినేటర్ ప్రాంచైజీలో ఆరో సినిమా టర్మినేటర్..డార్క్ ఫేట్ తెరకెక్కుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.


‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ ట్రైలర్ లో ఆర్నాల్డ్ టెర్మినేటర్‌గా కనిపిస్తున్నాడు. లిండా హామిల్టన్ మెషీన్ గన్‌లు పట్టుకుని టెర్మినేటర్లను వేటాడుతూ ఉన్న సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. జేమ్స్ కామెరన్ నిర్మించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ జేమ్స్ కామెరన్, డేవిడ్ ఎల్లిసన్ సంయుక్తంగా నిర్మించారు. ‘టెర్మినేటర్ 2: జడ్జ్‌మెంట్ డే’ కు డైరెక్ట్ సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది.

ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలవుతోంది. ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లిండా హామిల్టన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles