ఇక సినిమాలతో బిజీ కానున్న చైతూ-సమంత

Tue,November 7, 2017 10:51 AM

న్యూ కపుల్ నాగ చైతన్య,సమంతలు ఇటీవల హనీమూన్ కోసం లండన్ కి స్మాల్ టూర్ వేశారు. రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చిన ఈ జంట ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ అయ్యారు. నాగ చైతన్య రీసెంట్ గా యుద్ధం శరణం అనే ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే చిత్రాన్ని ప్రస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 8 నుండి మొదలు కానుండగా, రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోలో ఫోటో షూట్ నిర్వహించింది మూవీ టీం. బాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, అక్కినేని హీరో నాగ చైతన్య పై జరిపిన ఫోటో షూట్ నాగ్ కి ఎంతగానో నచ్చిందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇక సమంత ప్రస్తుతం రంగస్థలం 1985, మహానటి చిత్రాలతో పాటు రెండు తమిళ సినిమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున గ్రాండ్ గా జరపనున్న రిసెప్షన్ ఈ నెలలోనే ఉంటుందని టాక్.#Rangasthalam #setdiaries

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles