బాలీవుడ్ లోను దుమ్ములేపనున్న థమన్

Tue,May 16, 2017 01:01 PM
Thaman to make Bollywood debut

సౌత్ కంపోజర్ థమన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్న విషయాన్ని కన్ ఫాం చేశాడు. ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో పలు హిట్ చిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసిన థమన్ కి బాలీవుడ్ ఆఫర్ రావడం అభినందనీయం. ప్రస్తుతం ఇతని చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న గోల్ మాల్ ఎగైన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తుండగా, థమన్ ఈ చిత్రం కోసం ప్రత్యేక బాణీలను రెడీ చేస్తున్నాడు. గోల్ మాల్ ఎగైన్ చిత్రంలో అజయ్ దేవగణ్ మరియు పరిణితో చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ కేము, నీల్ నితిన్ ముకేశ్, టబు మరియు ప్రకాశ్ రాజు కీ రోల్స్ లో నటిస్తున్నారు.


1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles