వరుడిని వెతకమని దర్శకుడికి చెప్పిందట..

Sun,June 2, 2019 04:17 PM
Thamannah reveales about her Marriage


అభినేత్రి 2 సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మిల్కీ భామ తమన్నా. ఈ నేపథ్యంలో తమన్నా ఇటీవలే ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్క్వూ ఇచ్చింది. అయితే ఇంటర్వ్యూలో ఎప్పటిలాగే పెళ్లి విషయంపై తమన్నాని ప్రశ్నించారు. ఈ సారి మాత్రం ఆ ప్రశ్నకు కాస్త కొత్తగా సమాధానమిచ్చింది.

సరైన వ్యక్తి దొరికితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నా. కానీ సరైన వ్యక్తి దొరకాలి కదా అని చెప్పింది. అంతేకాదు నాకు సరిపడే మంచి అబ్బాయిని వెతికిపెట్టాలని డైరెక్టర్ ఏఎల్ విజయ్ కు కూడా చెప్పాను. మీరు కూడా నాకు ఓ మంచి వరుడిని చూస్తారని ఆశిస్తున్నానని మీడియాను కూడా కోరింది తమన్నా. తమన్నా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండి. దటీజ్ మహాలక్ష్మీ, ఖామోషి చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉంది. మంచి వరుడి దొరికితే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దంగా ఉన్నట్లేనని తమన్నా అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

3397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles